: వైసీపీ మరోసారి అభాసుపాలైంది: కేశినేని నాని


వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు కురిపించారు. నంద్యాల ఉప ఎన్నికలో జగన్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. జగన్ కుయుక్తులు నంద్యాలలో పని చేయడం లేదని చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహారాన్ని తీసుకొచ్చే వాహనాన్ని కూడా వదల్లేదని... పాంట్రీకారును తనిఖీ చేయించి, చివరకు అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. ఈసీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు మౌత్ పీస్ లా మారిన సాక్షి పేపర్, సాక్షి ఛానల్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. హత్యా రాజకీయాల చరిత్ర ఉన్న జగన్ పై 16 కేసులు ఉన్నాయని... అతను మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. 

  • Loading...

More Telugu News