: మొద‌టిసారి త‌మిళ సినిమాకు ఎమోజీ రూపొందించిన ట్విట్ట‌ర్‌!


విజ‌య్ న‌టించిన `మెర్సాల్‌` చిత్రానికి ట్విట్ట‌ర్ ప్ర‌త్యేకంగా ఎమోజీ రూపొందించింది. ఇలా ఓ త‌మిళ సినిమాకు ట్విట్ట‌ర్ ఎమోజీ రూపొందించ‌డం ఇదే మొద‌టిసారి. ఈ విష‌యాన్ని హీరో విజ‌య్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో వెల్ల‌డించారు. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నారు. పంచాయ‌తీ అధికారిగా, డాక్ట‌ర్‌గా, మెజీషియ‌న్‌గా విజ‌య్ క‌నిపించ‌నున్నారు. దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్‌, స‌మంతలు హీరోయిన్లుగా న‌టించారు. ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News