: సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్టులన్నీ డిలీట్ చేసిన పాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్.... కార‌ణం కొత్త ఆల్బం?


ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌తో నిరంత‌రం ట‌చ్‌లో ఉండే పాప్ సెన్సేష‌న్ టేల‌ర్ స్విఫ్ట్‌, త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లోని పోస్టులన్నింటినీ డిలీట్ చేసింది. ఇలా ఎందుకు చేసిందో అర్థం కాక అభిమానులు త‌ల‌బాదుకుంటున్నారు. `అకౌంట్లు హ్యాక్ అయ్యాయా?` లేక `కొత్త ఆల్బం ఏదైనా విడుద‌ల చేయ‌నుందా? అందుకే పాత పోస్టుల‌ను డిలీట్ చేసిందా?` అంటూ ఊహాగానాలు మొద‌లుపెట్టారు. ఈమెకు ట్విట్ట‌ర్‌లో 85 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు, ఇన్‌స్టాలో 102 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఫేస్‌బుక్ అకౌంట్‌తో పాటు టంబ్ల‌ర్‌, అధికారిక వెబ్‌సైట్‌ల‌లో కూడా ఎలాంటి స‌మాచారం లేదు. ఈ విష‌యం గురించి టేల‌ర్ గానీ, ఆమె త‌ర‌ఫు వాళ్లు గానీ ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

  • Loading...

More Telugu News