: అమెరికాకు ఇదే నా లాస్ట్ వార్నింగ్... అమెరికా అంతం దగ్గర పడింది!: కిమ్ జాంగ్ ఉన్


 అమెరికా-ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు ఇంకా సడలలేదు. తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా అంటూ ఈ రెండు దేశాలు రెచ్చగొట్టుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికాకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నానని హెచ్చరికలు జారీ చేశారు. అణుబాంబు ప్రయోగిస్తే ఉత్తరకొరియా సర్వనాశనమవుతుందని అమెరికా రక్షణ ప్రతినిధి ప్రకటించిన వెంటనే కిమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

 ‘క్లైమాక్స్’ దగ్గరపడిందని వ్యాఖ్యానించారు. అమెరికా విచారకరమైన వైఫల్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అంతం దగ్గరపడిందని, ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో దక్షిణకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా చెప్పినట్టల్లా దక్షిణకొరియా ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News