: హైదరాబాదులో కిడ్నాప్ కలకలం...పది లక్షలు డిమాండ్


హైదరాబాదులో కిడ్నాప్ కలకలం రేపుతోంది. నగర శివారు మేడ్చల్ కిష్టాపూర్ లో మణిందర్ అనే విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు మణిందర్ తండ్రికి ఫోన్ చేసిన దుండగులు, మణిందర్ తమ అదుపులో ఉన్నాడని, తక్షణం పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసులకు చెప్పాలని ప్రయత్నిస్తే మణిందర్ ప్రాణానికే ప్రమాదమని స్పష్టం చేశారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా, సీసీ పుటేజ్, ఇతర వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, మణిందర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

  • Loading...

More Telugu News