: అంగారక గ్రహం మీద ప్రతిరోజు గ్రహణమే... ఫొటోలు పంపిన క్యూరియాసిటీ!
భూమ్మీద గ్రహణాలు సంవత్సరానికి ఐదో, ఆరో వస్తాయి. అదే అంగారక గ్రహం మీద ప్రతిరోజు రెండుసార్లు గ్రహణం ఏర్పడుతుంది. కాకపోతే అది పాక్షిక గ్రహణమే. అంగారక గ్రహం ఉపగ్రహాలైన ఫొబోస్, డేమోస్ల పరిమాణం సూర్యునితో పోల్చినపుడు చాలా చిన్నగా ఉండటంతో అక్కడ సంపూర్ణ గ్రహాలు ఏర్పడవు. రెండు ఉపగ్రహాల్లో కేవలం ఫొబోస్ ఏర్పరిచే గ్రహణాలు మాత్రమే అంగారక గ్రహం ఉపరితలం నుంచి కనిపిస్తాయి.
డేమోస్ చాలా దూరంలో ఉండటం వల్ల గ్రహణం ఏర్పడినా పెద్దగా పరిగణలోకి రాదు. అంగారక గ్రహం నుంచి ఫొబోస్ కేవలం 6000 మైళ్ల దూరంలోనే పరిభ్రమిస్తుంటుంది. ఇది రోజుకి రెండు సార్లు గ్రహాన్ని చుట్టివస్తుంది. 2013 ఆగస్టులో అంగారక గ్రహం మీద క్యూరియాసిటీ రోవర్ తీసిన గ్రహణం ఫొటోలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా విడుదలచేసింది. ఈ చిత్రాల్లో అంగారక ఉపగ్రహం ఫొబోస్ పరిమాణాన్ని సూర్యుని పరిమాణంతో పోల్చి చూడొచ్చు.