samanta: కథలో నాయిక ప్రాధాన్యత పెరుగుతోంది : సమంతా


ఒకప్పుడు నాయకా .. నాయిక పాత్రలు కథలో భాగమై, కథను నడిపించేవి. ఆ తరువాత కాలంలో కథానాయికల పాత్రలకి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. గ్లామర్ ను ప్రధానంగా చేసుకుని కథానాయికలు ఆటపాటలకు పరిమితమైపోయారు. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ మార్పు మొదలైందని సమంతా అంటోంది. కథలో నాయిక ప్రాధాన్యత పెరుగుతూ వస్తోందని చెబుతోంది.

 కథానాయికలను దృష్టిలో పెట్టుకుని పాత్రలను క్రియేట్ చేయడం జరుగుతోందని అంటోంది. కథలో హీరోతో పాటు హీరోయిన్ కి కూడా సమానమైన భాగం దక్కుతోందని చెబుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు కథ ప్రధానమైపోయిందనీ, కథ చుట్టూనే పాత్రలు తిరుగుతున్నాయని అంటోంది. ఈ మార్పు మంచి ఫలితాలను కూడా ఇస్తోందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. తాజాగా ఆమె చేసిన 'రాజుగారి గది 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది . 

samanta
  • Error fetching data: Network response was not ok

More Telugu News