: 30 సెకన్లలో 30 వేల మంది... అరగంటలో 10 కోట్ల శవాలు తేలుతాయి!: అమెరికా దాడి తీవ్రతను తెలిపిన ఉన్నతాధికారి


అమెరికా ఒక్కసారిగా ఉత్తరకొరియాపై దాడికి దిగితే ఆ తీవ్రత ఎలా ఉంటుందో ఆ దేశ రక్షణశాఖ కార్యదర్శి జాన్ మాటిస్ వెల్లడించారు. వాషింగ్టన్ లో ఆయన మాట్లాడుతూ, గువాం ద్వీపంపై ఉత్తరకొరియా దాడికి దిగితే ఆ దేశంపై అణుదాడి చేసేందుకు అమెరికా వెనకాడేది కాదని అన్నారు. అలాంటి దాడి జరిగితే కేవలం ఉత్తరకొరియాకు మాత్రమే కాదని, దక్షిణకొరియాతో పాటు జపాన్‌ కూడా తీవ్రంగా దెబ్బతినేదని అన్నారు. ఈ మూడు దేశాల్లో శవాల గుట్టలు కనిపించేవని అన్నారు.

 అణుదాడి జరిగిన 30 సెకన్లకు 30,000 మంది, అరగంటలో 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని ఆయన తెలిపారు. అయితే అలా జరగడం తమకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. అణుదాడులు ప్రపంచ వినాశనానికి కారణమవుతాయని, అంతకు మించి వాటితో సాధించేదేమీ ఉండదని ఆయన హితవు పలికారు. అణుదాడులు జరిగితే దాని ప్రభావం కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాదని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News