: రాంగోపాల్ వర్మ మానసిక స్థితిపై కామెంట్ చేసిన శివాజీ రాజాపై అభిమానుల ఆగ్రహం!


 టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ దందాలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రభుత్వానికి క్షమాపణ చెప్పిందంటూ వర్మ ఆమధ్య తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా శివాజీ రాజా మండిపడ్డాడు. రాంగోపాల్ వర్మ మానసికస్థితి బాగాలేదని అన్నాడు. వర్మ సినిమాలు తీయడం మానేసి, ట్విట్టర్ లో తిట్లతో బతుకుతున్నాడని ఆయన ఎద్దేవా చేశాడు. ట్వీట్ లతో జనాలను కన్‌ ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడని ఆయన మండిపడ్డాడు.

మంచి సినిమాలు తీయకుండా ట్వీట్లతో ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? అంటూ ఎద్దేవా చేశాడు. ఆయనను ఒక్క మానసిక వైద్యుడికి కాదు, ఇద్దరికి చూపించాలని సూచించాడు. దీనిపై వర్మ అభిమానులు మండిపడుతున్నారు. వర్మ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిట్ అధికారులు ఇబ్బంది పడ్డారన్న సంగతిని శివాజీ రాజా గుర్తించాలని వారు చెబుతున్నారు. కాగా, 'మా' ఎవరికీ క్షమాపణలు చెప్పలేదని శివాజీ రాజా స్పష్టం చేశాడు. 

  • Loading...

More Telugu News