: ఈ నెల 21న అమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణం
తొంభై తొమ్మిదేళ్ల తర్వాత అమెరికాలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 21న అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రోజు ఉదయం 10.15 గంటలకు సూర్యగ్రహణం కనిపిస్తుందని, దక్షిణ కరోలినాలో అయితే మధ్యాహ్నం 2.50 గంటలకు గ్రహణం ప్రారంభమై ఒరెగాన్ సముద్రతీరం వద్ద ముగుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక కళ్ల అద్దాలను వారికి అందజేస్తున్నాయి.