: ప్రెస్ నోట్: నోర్వాక్, కనెక్టికట్‌లో అలరించనున్న`గోదావరి` రుచులు
ప్రెస్ నోట్: దక్షిణ భారతదేశ రుచుల రెస్టారెంట్లో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి పొందిన బ్రాండ్‌గా పేరొందిన `గోదావరి` నోర్వాక్ సీటీలోని ఆహార ప్రియులకు తన ఆతిథ్యాన్ని అందించనుంది. ఈ వారాంతం ఆగస్టు 19,2017 నుంచి గోదావరినోర్వాక్లో ప్రవహించనుంది!
ఇటీవలే ప్రారంభించిన `గోదావరి డెట్రాయిట్`కు వచ్చిన అపూర్వమైన స్పందనతో `టీం గోదావరి`తో కనెక్టికట్ రాష్ట్రంలో స్టాంఫర్డ్ కు కొన్ని మైళ్ల దూరంలో రెండో రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
గోదావరి బ్రాండ్ రోజురోజుకు తన పరిధిని విస్తృతం చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా దక్షిణ భారతదేశ ప్రామాణికమైన రుచులను అనేక వెరైటీలలో భోజన ప్రియులకు అందిస్తోంది.
గోదావరి నోర్వాక్ (Norwalk, Connecticut) అత్యంత కీలకమైన ప్రాంతంలో కొలువుదీరి ఉంది. I95కి అతి సమీపంలో ఉండటమే కాకుండా స్టాంఫర్డ్ కార్పొరేట్ హబ్‌కు కొద్ది మైళ్ల దూరంలోనే గోదావరి నోర్వాక్ ఉంది.
“దక్షిణభారతదేశానికి చెందిన అత్యుత్తమ భోజన రుచులను ఆరగించాలని మేం చాలా కోరికతో ఉన్నాం. `గోదావరి` నోర్వాక్ కు వస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ వార్త ఇక్కడ నివసించే భారతీయలందరికీ గొప్ప తీపికబురు” అని స్టాంఫర్డ్ లో సుమారు పదేళ్లకు పైగా నివసిస్తున్న నరేశ్ రామస్వామి తన సంతోషం వ్యక్తం చేశారు.
“గోదావరి హల్ట్రోడ్, రోడ్ ఐలాండ్‌లో గోదావరిని ఇటీవలి కాలంలో విజయవంతంగా నిర్వహిస్తున్నాం. కనెక్టికట్ రాష్ట్రంలో మా రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అమితమైన సంతోషకరంగా ఉంది. త్వరలోనే మిల్ఫర్డ్, సీటీలో మాకేంద్రాన్ని ప్రారంభించనున్నాం. మేం ఎల్లప్పుడు చెప్తున్నట్లుగా “టీం గోదావరి” అత్యుత్తమ భారతీయ ఆహార రుచులను, ఉన్నతమైన వ్యాపార విలువలతో అందించేందుకు నిరంతరం తపిస్తుంది” అని గోదావరి నోర్వాక్, హర్ట్ఫోర్డ్ యజమాని తేజ రావెళ్ల తెలిపారు.
గోదావరి నోర్వాక్ (GODAVARI) ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతమైన లంచ్ బఫెట్‌తో పాటుగా నోరూరించే వంటకాలు భోజనప్రియుల కోసం సిద్ధంగా ఉన్నాయి.
“అరుందతి అలసంద వడ”, “కరివేపాకు మష్రూం వేపుడు”, “గల్లీ ఎగ్ పకోడి”, “ఎర్ర కోడి వేపుడు”, “బందర్ బొమ్మిడాయల పులుసు”, “పటాస్ లివర్ (మేక)” వంటివే కాకుండా మరెన్నో విభిన్నమైన రుచులు ఉన్నాయి.
“మేం ఎన్నో కొత్త ప్రాంతాల్లోకి విస్తరించడమే కాకుండా నూతన బ్రాండ్లను సైతం వినూత్న కాన్సెప్ట్ లతో ప్రవేశపెడుతున్నాం. స్పైసీ సలా పేరుతో మొట్టమొదటి దక్షిణ భారతదేశ ఫుడ్ ట్రక్‌ను బోస్టన్‌లో ప్రవేశపెట్టడం ఇందులో ఒకటి. యువకులతో కూడిన మా బృందంలోని ప్రతి ఒక్కరి వయసు 30 ఏళ్లలోపే. మాకు సుదీర్ఘ ప్రయాణం సాగించే శక్తిసామర్థ్యాలు, అవకాశాలు ఉన్నాయి. గొప్ప భోజన రుచులకు, వినూత్నమైన కాన్సెప్ట్ లకు దేశంలోనే ప్రత్యేక చిహ్నంగా మేంనిలుస్తామని నమ్మకం ఉంది” అని గోదావరి గ్రూప్ సీఓఓ జస్వంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
“గోదావరి డెట్రాయిట్కు అనూహ్యమైన స్పందన వస్తోంది. కెనడా నుంచి సైతం భోజనప్రియులు గోదావరికి వచ్చి మా రుచులను ఆరగిస్తున్నారు” అని గోదావరి డెట్రాయిట్ యజమాని రాజేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
గోదావరి డెట్రాయిట్ గొప్ప ప్రారంభోత్సవం సందర్భం నాటి ట్రైలర్
ఈ వారాంతంలో గోదావరి నోర్వాక్కు విచ్చేసి నోరూరించే వంటకాలను ఆరగించండి.
మా చిరునామా:
గోదావరి నోర్వాక్
480, వెస్ట్పోర్ట్ హైవే,
నోర్వాక్, సీటీ- 06851
ఫోన్: 203-939-9242
Godavari Norwalk, 480 Westport Ave, Norwalk, CT - 06851.
మరిన్ని వివరాలకు దయచేసి సంప్రదించండిః
అభి @ 215-992-2749
Norwalk@GodavariUS.com
మరోమారు ప్రత్యేక కృతజ్ఞతలు... మా వంటకాలను మీరంతా ఆస్వాదిస్తున్నారని భావిస్తున్నాం
www.GodavariUS.com
Press note released by: Indian Clicks, LLC