: కాల్ డ్రాప్స్ పై కఠినంగా వ్యవహరించనున్న ట్రాయ్!
వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలిగించే కాల్ డ్రాప్స్ పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పందించింది. ఈ నేపథ్యంలో కాల్ డ్రాప్స్ ను నిరోధించేందుకు కఠిన మార్గదర్శకాలను ట్రాయ్ జారీ చేసింది. ఈ విషయమై ప్రమాణాలను పాటించడంలో సర్వీస్ ప్రొవైడర్లు విఫలమైతే కనుక తొలుత రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని, ఇదే పద్ధతిని కనుక కొనసాగిస్తే ఆ జరిమానా రూ.10 లక్షల వరకు ఉంటుందని ట్రాయ్ కార్యదర్శి ఎస్ కె గుప్తా హెచ్చరించారు. ఆయా నెట్ వర్క్ ల సామర్ధ్యాన్ని అనుసరించి జరిమానాలను నిర్దేశిస్తామని చెప్పారు.కాగా, కాల్ డ్రాప్ పై ప్రస్తుతం యాభైవేలు జరిమానాగా విధిస్తున్నారు.