charan: చరణ్ క్లోజ్ ఫ్రెండ్స్ జాబితాలో సురేందర్ రెడ్డి!


సినిమా ప్రపంచంలో దర్శకులకు .. హీరోలకు మధ్య పరిచయాలు ఉండటం సహజం. అయితే కొన్ని పరిచయాలు మాత్రం స్నేహంగా మారుతుంటాయి. ఒకరి ఇంట్లో జరిగే వేడుకలకు మరొకరు వెళ్లేంత స్థాయికి చేరుతుంటాయి. అలాంటి స్నేహితులుగా చరణ్ .. సురేందర్ రెడ్డి కనిపిస్తున్నారనేది ఫిల్మ్ నగర్ టాక్.

'ధ్రువ' సినిమా నుంచి సురేందర్ రెడ్డితో చరణ్ స్నేహం పెరుగుతూ వచ్చింది. ఈ కారణంగానే చిరంజీవి 151వ సినిమా సురేందర్ రెడ్డి చేతికి వెళ్లిందని అంటున్నారు. ఇక సురేందర్ రెడ్డి తనయుడి బర్త్ డే ఫంక్షన్ కి .. ఆయన కొత్తగా స్టార్ట్ చేసిన రెస్టారెంట్ ఓపెనింగ్ కి చరణ్ వెళ్లడం గురించి చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి కూడా రానా .. శర్వానంద్ లతో చరణ్ చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ జాబితాలో సురేందర్ రెడ్డి కూడా చేరిపోయాడన్న మాట.    

charan
surendar reddy
  • Loading...

More Telugu News