: విమాన స‌ర్వీసులు ర‌ద్దు వార్త అవాస్తవం!: 'ఇండిగో’ స్పష్టీకరణ


ఇండిగో విమానాల ఇంజన్లలో తలెత్తిన సమస్యల కారణంగా పలు విమానాలు రద్దయినట్టు వస్తున్న వార్తలపై సదరు సంస్థ స్పందించింది. ‘ఇండిగో’ విమానాలను రద్దు చేశామనే వార్తలలో వాస్తవం లేదని తెలిపింది. మీడియాకు చెందిన ఓ వర్గం వారు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, ఎయిర్ బస్ ఎ320 నియో ఎయిర్ క్రాఫ్ట్ లోని కొత్త ఇంజన్ లో సమస్యలు తలెత్తాయి. యునైటెడ్ టెక్నాలజీస్ కు చెందిన ప్రాట్ అండ్ విట్నీలు తయారు చేసిన ఇంజన్లలో సమస్యలు తలెత్తడంతో 13 విమానాలను రిపేరు నిమిత్తం తరలించారు. దీంతో, మొత్తం 84 విమానసర్వీసులు రద్దయ్యాయి. దీంతో, ఎయిర్‌బస్‌ నుంచి ఇండిగో, దాని ప్రత్యర్థి గోఎయిర్‌లు నడిపే విమానాల రాక ఆలస్యమవుతోంది.

అయితే, తమ ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకని వేరే విమానాల ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చినట్టు సదరు విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ నెల మొదట్లో కూడా ఆయా విమానాల్లో ఇదే సమస్య తలెత్తడంతో, ప్రాట్ అండ్ విట్నీలు ఆయా విమానయాన సంస్థలకు నష్టపరిహారం చెల్లించుకున్నారు. 

  • Loading...

More Telugu News