: మెట్రో రైల్లో ప్రయాణిస్తోన్న యువ‌తిని వీడియో తీసి, ఆపై దాడి చేసిన వ్య‌క్తి!


మెట్రో రైల్లో ప్రయాణిస్తోన్న ఓ యువ‌తిని వీడియో తీస్తోన్న ఓ వ్య‌క్తిని తోటి ప్ర‌యాణికులు పోలీసుల‌కు ప‌ట్టించారు. ఓ సాఫ్ట్‌ వేర్ కంపెనీలో పనిచేసే ఓ యువతి (25) నోయిడా సెక్టార్ 16 నుంచి అక్షర్‌ధామ్‌ వెళ్లేందుకు మెట్రో ట్రెయిన్ లో ప్ర‌యాణిస్తోంది. అదే స‌మ‌యంలో ట్రెయిన్‌లో ఉన్న‌ ఓ వ్య‌క్తి (40)  ఆమెను తన సెల్‌ ఫోన్‌ లో వీడియో తీస్తున్నాడు. దీంతో ఆ యువతి అతని చేతిలో ఫోన్ లాక్కోవాల‌ని చూడ‌గా, ఆగ్ర‌హంతో ఆ వ్య‌క్తి ఆమెపై దాడి చేశాడు. తోటి ప్రయాణికుల సాయంతో ఆ యువ‌తి యుమున బ్యాంక్‌ డిపో మెట్రో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. స‌ద‌రు నిందితుడిని బీహార్ వాసిగా గుర్తించిన పోలీసులు అత‌డిని అరెస్టు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. ఆ యువతిని వీడియో తీసిన సమయంలో నిందితుడు బాగా తాగి ఉన్నాడని చెప్పారు.    

  • Loading...

More Telugu News