: పొలంలో పనిచేయడానికి ఒప్పుకోలేదని దళిత మహిళ ముక్కు కోశారు!
తమ పొలంలో పనిచేయడానికి ఒప్పుకోవడం లేదని ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం ఓ దళిత మహిళ ముక్కును కోసేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజా గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నరేంద్ర సింగ్ పొలంలో మందు చల్లడానికి అదే గ్రామానికి చెందిన దళిత మహిళ జానకీ బాయిని పిలిచారు. మందు చల్లడానికి ఆమె నిరాకరించడంతో నరేంద్ర సింగ్, తన తండ్రి సాహెబ్ సింగ్‌లు ఆమెను కొట్టారు.
తర్వాత ఈ విషయం గురించి తన భర్త రాఘవేంద్రతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి జానకీ బాయి బయల్దేరింది. వీరిని మార్గమధ్యంలో అడ్డగించి నరేంద్ర సింగ్, అతని అనుచరులు ఆమెను చితకబాదారు. అంతేకాకుండా గొడ్డలితో తన ముక్కును నరికినట్లు జానకీ బాయి వివరించింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జానకీ బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇదిలా ఉండగా ఈ గొడవ రెండు కుటుంబాల మధ్య జరిగిందని, కావాలని ఈ వివాదానికి కులం రంగు పులిమారని రాష్ట్ర హోం మంత్రి భూపీంద్ర సింగ్ అన్నారు.