: తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్న యువతి... నది దాటిన క్షణాలకే కూలిన వంతెన... వీడియో చూడండి!
క్షణాల వ్యవధిలో మృత్యువును తప్పించుకున్న వాళ్లను చూస్తుంటాం! అలాగే ఈ చైనా యువతి కూడా కేవలం ఒక్క క్షణం వ్యవధిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఉప్పొంగుతున్న నది మీదుగా నిర్మించిన కర్ర వంతెనను పరిగెత్తుతూ దాటింది. తాను ఒడ్డుకు చేరుకున్న ఒక్క క్షణంలోనే కర్ర వంతెన కూలిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన దక్షిణ చైనాలోని వెంకియావో ప్రాంతంలో జరిగింది. ఇటీవల ఈ ప్రాంతంలో బాగా కురిసిన వర్షాల కారణంగా ఇక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదికి మరోవైపు చిక్కుకున్న వారంతా ఈ కర్రవంతెన ద్వారా ఇవతలి ఒడ్డుకు వచ్చారు. వారిలో చివరగా వచ్చిన ఈ యువతి క్షణాల వ్యవధిలో ప్రాణాలు నిలుపుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.