: ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యలో నాగార్జున ర్యాంకు ఎంతో తెలుసా?
అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు. అందుకే ఆయనకు ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువే. ఇటీవలే ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యలో నాగార్జున ర్యాంకు 260. `ట్విట్టర్ కౌంటర్` అనే వెబ్‌సైట్ ద్వారా ఆయన అభిమాని ఒకరు విషయాన్ని నాగార్జున ట్విట్టర్ వాల్‌పై పోస్ట్ చేశారు.
దానికి నాగార్జున `ఇంత అభిమానం చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు` అంటూ సమాధానమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యలో మొదటి ర్యాంకు పాప్ సింగర్ కేటీ పెర్రీది. ఈమెకు 10,23,16,810 మంది ఫాలోవర్లు ఉన్నారు. టాప్ 100లో నరేంద్రమోదీ, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్‌ఖాన్, దీపికా పదుకొనె, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కొహ్లీ ఉన్నారు.