trivikram: త్రివిక్రమ్ గారూ, ఇక మీదే భారం!: నితిన్


త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' చిత్రం అప్పట్లో 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దాంతో ఆ తరువాత సినిమా కూడా అదే స్థాయిలో హిట్ కొట్టాలనే పట్టుదలతో నితిన్ 'లై' సినిమా చేశాడు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.

 దాంతో నితిన్ నేరుగా వెళ్లి త్రివిక్రమ్ ను కలిసినట్టు సమాచారం. నితిన్ తదుపరి సినిమాకి త్రివిక్రమ్ కథను అందించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి కథను అందించి వదిలేయకుండా, కాస్త దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉండమని త్రివిక్రమ్ ను నితిన్ రిక్వెస్ట్ చేశాడట. తనకి తప్పకుండా హిట్ పడేలా చూడమని కోరాడట. ఈ సినిమాకి పవన్ కల్యాణ్ కూడా ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News