: ఒక్క ట్వీట్ తో అమెజాన్ కు 36 వేల కోట్ల రూపాయల నష్టం తెచ్చిన ట్రంప్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఆన్‌ లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ కు 36,000 కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టి భారీ షాక్ ఇచ్చారు. దాని వివరాల్లోకి వెళ్తే...నిన్న ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో ‘పన్ను చెల్లిస్తున్న చిరువ్యాపారులకు అమెజాన్ బాగా నష్టం కలిగిస్తోంది. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అమెరికా అంతటా ప్రజలు బాధపడుతున్నారు. చాలా ఉద్యోగాలు కోల్పోతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. అంతే, ఈ ట్వీట్ అమెజాన్ కొంపముంచింది. స్టాక్‌ మార్కెట్‌ లో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో 1.2 శాతం నష్టాన్ని చవి చూశాయి. దీంతో సుమారు 5.7 బిలియన్ డాలర్ల (36 వేల కోట్ల రూపాయలు) సంపద హరించుకుపోయింది. తరువాత కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టం మాత్రం భారీగానే వాటిల్లిందని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News