: గంగుల మా పార్టీనీ వీడటమా.. అసలు ఆయన మా పార్టీలోనే లేరు!: అంబటి రాంబాబు


అసలు, గంగుల ప్రతాపరెడ్డి తమ పార్టీలోనే చేరలేదని, అలాంటిది వైసీపీని వీడటం ఏంటంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గంగుల ప్రతాపరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారంటూ కొన్ని చానెళ్లు, పత్రికలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. వాస్తవాలను ప్రచురించే, ప్రసారం చేసే ధైర్యం ఆయా పత్రికలు, చానెళ్లు చేయడం లేదని విమర్శించారు. వైసీపీపై బురద చల్లడమే ధ్యేయంగా ఆయా పత్రికలు, చానెళ్లు పని చేస్తున్నాయని మండిపడ్డ అంబటి, చంద్రబాబు అండ లేకుండా బతకలేమని అవి భావిస్తున్నాయని విమర్శించారు.

  • Loading...

More Telugu News