: నంద్యాలలో ఎవరిని ఓడించాలో మా కాపు జాతికి తెలుసు: ముద్రగడ
సోమవారంనాడు విజయవాడలో కాపులతో నిర్వహించిన సమావేశంలో కాపుల చెవిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి పెద్ద క్యాబేజీ పెట్టారని ముద్రగడ పద్మనాభం అన్నారు. విజయవాడ సమావేశంలో చంద్రబాబు ఏదైనా శుభవార్త చెబుతారని తాము ఆశించామని... కానీ మళ్లీ మోసం చేశారని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో ఎవరికి ఓటు వేయాలో తెలుసుకోలేని స్థితిలో మా కాపు జాతి లేదని... ఎవరిని ఓడించాలో కాపులకు తెలుసని అన్నారు. తన స్వగ్రామం కిర్లంపూడిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.