: భర్త ఫోన్ ఎత్తడం లేదని కుమారుడికి ఉరి వేసి చంపాలనుకున్న మహిళ.... వీడియో చూడండి
భర్త మీద అనుమానంతో, ఆయన మీది కోపాన్ని కన్నకొడుకు మీద చూపించింది థాయ్‌లాండ్‌కు చెందిన నారేమున్ జంపసెర్టు. భర్త ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో వారి కుమారుడికి ఉరి వేసి, చంపేస్తానని బెదిరిస్తూ వీడియో తీసి పంపింది. దీంతో భయపడిన భర్త, ఆ వీడియోను తన చెల్లికి పంపించాడు. ఆమె పోలీసుల సహాయం కోరుతూ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసింది.
ఈ వీడియోలో `నీ బాబు బ్రతకాలంటే నువ్వు త్వరగా ఇంటికి రా! లేకపోతే ఉరి వేసి చంపేస్తాను!` అంటూ కోపంగా మాట్లాడుతూ, బాబు మెడకు కట్టి ఉన్న నల్లతాడును గట్టిగా లాగి బాబుకు ఊపిరాడకుండా చేస్తున్న నారేమున్‌ను చూడొచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, భర్త మీద అనుమానంతో తాను క్షణికావేశంలో అలా ప్రవర్తించానని, అది కేవలం బెదిరింపు మాత్రమేనని, నిజానికి తాను చనిపోవాలనుకున్నానని, తర్వాత బాబు వంకతో బెదిరించినట్లు నారేమున్ అంగీకరించింది. దీన్ని కుటుంబ అంతర్గత సమస్యగా భావించి పోలీసులు ఆమెను విడిచిపెట్టారు.