: బాలకృష్ణ ఏం మాట్లాడుతాడో అతనికే తెలీదు...కోపమొస్తే అందర్నీ కొడతాడు: శిల్పా మోహన్ రెడ్డి
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదని శిల్పా మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, బాలకృష్ణకు కోపమొస్తే అందర్నీ కొడతాడని అన్నారు. బాలయ్యకు తన గురించి ఏమీ తెలియదని ఆయన చెప్పారు. తాను పుట్టింది టీడీపీలో అని అన్నారని, తాను టీడీపీలో పుట్టినవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లో పుట్టి టీడీపీలో చేరిన వాడినని ఆయన తెలిపారు. గడిచిన మూడున్నరేళ్లలో నంద్యాలను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని అడిగారు. ఉపఎన్నికలు రాకపోయి ఉంటే నంద్యాలకు ఈ నిధులు ఖర్చు చేసేవారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని ఆయన చెప్పారు. ఎవరికి ఓటెయ్యాలో ప్రజలకు తెలుసని ఆయన చెప్పారు.