: చీర కట్టుకోలేద‌ని ప్రియాంక‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డ నెటిజ‌న్లు


గ‌తంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో స‌మావేశానికి పొట్టి వ‌స్త్రాల‌తో రావ‌డంపై నెటిజ‌న్లు అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి భార‌త సంప్ర‌దాయం ప్ర‌కారం చీర గానీ, చుడీదార్ గానీ వేసుకుంటే ఏమైంద‌ని నెటిజ‌న్లు ప్రియాంక‌పై విరుచుకుప‌డ్డారు. భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రియాంక చోప్రా త‌న ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో జీన్స్‌, స్లీవ్‌లెస్ టాప్ వేసుకుని త్రివ‌ర్ణంలో ఉన్న చున్నీని ప్రియాంక‌ గాల్లో ఆడిస్తున్న‌ట్లుగా ఉంది.

 దీనిపై నెటిజ‌న్లు వివిధ ర‌కాలుగా స్పందించారు. `క‌నీసం స్వాతంత్ర్య దినోత్స‌వం రోజునైనా చీర క‌ట్టుకోవ‌చ్చు క‌దా!`, `భార‌త్ ప‌రువు తీశావ్‌! ఇక నువ్వు ఇక్క‌డికి రావొద్దు` అంటూ కామెంట్ చేశారు. కొంత‌మంది మాత్రం `త‌న లైఫ్ త‌నిష్టం`, `నెగెటివ్ కామెంట్లు చేయ‌కండి` అంటూ ప్రియాంక‌కు మద్ద‌తిచ్చారు. ప్ర‌స్తుతం ప్రియాంక హాలీవుడ్ ప్రాజెక్టుల‌కు సెల‌వు పెట్టి రెండు వారాల పాటు ముంబైలో గ‌డిపేందుకు ఇండియా వ‌చ్చింది. ఈ విష‌యం త‌ను సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

  • Loading...

More Telugu News