: నోకియా 8 వచ్చేసింది... ధర రూ. 45 వేలు!
లండన్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో స్మార్ట్ ఫోన్ అభిమానులు ఎదురు చూస్తున్న తమ కొత్త ఫోన్ నోకియా 8ను హెచ్ఎండీ గ్లోబల్ విడుదల చేసింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, ఐఫోన్ 8 మోడల్స్ కు గట్టి పోటీ ఇస్తుందని టెలికం వర్గాలు అంచనా వేస్తున్న ఈ ఫోన్ అక్టోబర్ లో ఇండియాకు రానుంది. దీని ధర రూ. 45 వేల వరకూ ఉంటుంది. ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే, ముందు, వెనుక 13 ఎంపీ కెమెరాలు ఫోన్ ను ఆకర్షణీయం చేశాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 5.3 అంగుళాల డిస్ ప్లే, నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, 3090 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి సదుపాయాలున్నాయి.