: ఎల్లుండే ముహూర్తం... తెలుగుదేశంలో చేరుతున్నా: గంగుల ప్రతాప్ రెడ్డి


ఎల్లుండి శనివారం నాడు సీఎం చంద్రబాబునాయుడి సమక్షంలో తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు గంగుల ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. నిన్న చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపిన ఆయన, నేడు తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులు తననెంతో ఆకర్షించాయని తెలిపారు. ఒక ఇంట్లోని వారు వేర్వేరు పార్టీల్లో ఉండటం తప్పేమీ కాదని వ్యాఖ్యానించిన ఆయన, టీడీపీలో తానేమీ పదవులను ఆశించి రావట్లేదని తెలిపారు. కాగా, 19న చంద్రబాబు నంద్యాలలో పర్యటించి, మలివిడత ఎన్నికల ప్రచారంలో పాల్గొననుండగా, ఆ సమయంలోనే గంగుల పచ్చ కండువాను కప్పుకోనున్నారు.

  • Loading...

More Telugu News