: ఏంటీ దారుణం...4 కోట్లు తీసుకుని...ఇదేం విధానం: 'లోథా' బిల్డర్ ని నిలదీసిన జగపతి బాబు


హైదరాబాదులోని కూకట్ పల్లిలో లోధా అపార్ట్ మెంట్స్ బిల్డర్ తమను మోసం చేశాడని ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు మండిపడ్డారు. జగపతిబాబు మీడియాతో మాట్లాడుతూ, లోధా గేటెడ్ కమ్యూనిటీ, హై ఎండ్ అపార్ట్ మెంట్స్ పేరుతో తమ నుంచి 4 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేశారని అన్నారు. ఇప్పుడు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్లను కలపుతామని బిల్డర్ చెబుతున్నాడని, అదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అలా బిల్డర్ తనకి నచ్చినట్టు చేయడానికా? తాము అంత పెద్ద మొత్తంలో డబ్బులిచ్చింది? అని ఆయన అడిగారు.

సుమారు 7,000 మంది అక్కడ ఉంటున్నారని, వారంతా బిల్డర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. అపార్ట్ మెంట్లను గేటెడ్ కమ్యూనిటీలో కలిపితే రక్షణ ఉంటుందా? అని ఆయన అడిగారు. ప్రశాంతత కోసమే ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీని కోరుకుంటారని, అలాంటిది లోధా అపార్ట్ మెంట్స్ లో ఉంటుందా? అని అంతా ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. బిల్డర్ ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, కాదు, కూడదని మొండికేస్తే ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా తమకు తెలుసని ఆయన హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News