pavan: బర్త్ డే వేడుక తరువాత ఫారిన్ కి పవన్ కల్యాణ్!


త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కథానాయకుడిగా ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. వచ్చేనెల 2వ తేదీన పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఆయన బర్త్ డే వేడుకలు ముగిసిన తరువాత ఈ సినిమా టీమ్ యూరప్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకి సంబంధించి ఇది మేజర్ షెడ్యూల్. దీంతో దాదాపు షూటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు. యూరప్ లో ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, పాటలను కూడా చిత్రీకరించనున్నారు. త్రివిక్రమ్ - పవన్ క్రేజీ కాంబినేషన్ కారణంగా, ఇకపై పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయిస్తానని పవన్ చెప్పడం వలన .. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.      

  • Loading...

More Telugu News