: జై మ‌ట్టి గ‌ణేశా.... అంటున్న మంత్రి కేటీఆర్‌


ప‌ర్యావ‌ర‌ణానికి న‌ష్టం క‌లిగించే ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ గ‌ణేశుడి విగ్ర‌హాల స్థానంలో మ‌ట్టి గ‌ణేశుడి విగ్ర‌హాలు ప్ర‌తిష్టించాల‌ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ త‌ర‌ఫున మ‌ట్టి గ‌ణేశుడి విగ్ర‌హాల‌ను అమ్ముతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అందుకు సంబంధించిన ప్ర‌చార వీడియోను ఆయ‌న షేర్ చేశారు. `మ‌నంద‌రికీ గ‌ణేశుడంటే ఇష్టం. అలాగే అంద‌రికీ ఇష్ట‌మైన గ‌ణేశుడు ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించాల‌ని కోరుకుంటాడ‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. జై మ‌ట్టి గ‌ణేశా!` అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News