: సరదాగా ఇలా ఫోటో దిగి... నెటిజన్లను అయోమయంలోకి నెట్టిన జంట!


అంత పెద్ద చెట్టును ఆమె ఎలా చేతులతో పట్టుకుంది? ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో చూసిన తరువాత ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న ఇది. ఈ ఫోటోను చూసిన వారందరికీ వచ్చే అనుమానం అదే. బ్రిటన్ బాక్సర్ జాషువా కెల్లీ, ఆయన సతీమణి చాలా క్యాజువల్ గా ఈ ఫోటోను దిగి, సోషల్ మీడియాలో పంచుకోగా, అది అంతులేని అయోమయానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వేలకొద్దీ లైక్ లను తెచ్చుకుంది. ఇక్కడున్న ఫోటోను మరోసారి నిశితంగా పరిశీలించండి. అసలు విషయం ఏంటన్నది తెలిసిందా?

చేత్తో చెట్టును పట్టుకున్నట్టు కనిపిస్తున్నది కేవలం భ్రాంతి మాత్రమే. ఆప్టికల్ ఇల్యూజన్. ఆ చెట్టు నిజానికి వారి వెనకాలే ఉంది. ఆమె జుట్టు, ఆపై ఆమె తన చేతికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ కలసి అనుకోకుండా ఈ ఫోటోను ఇలా మార్చేశాయన్నమాట.

  • Loading...

More Telugu News