: శ్రీకాకుళం జిల్లాలో కంపించిన భూమి... పరుగులు తీసిన ప్రజలు
శ్రీకాకుళంలో స్వల్ప భూకంపం సంభవించింది. దాని వివరాల్లోకి వెళ్తే...శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని వివిధ గ్రామాల్లో భూమి కంపించింది. మూడు సెకెన్లకుపైగా భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల వాసులు బెంబేలెత్తిపోయారు. ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. కాళ్ల కింద భూమి కంపించిపోయిందని స్థానికులు చెబుతున్నారు. భూకంప తీవ్రత వంటి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.