: మక్కా హజ్ యాత్రలో దారుణం... 31 మంది మృతి!


సౌదీ అరేబియాలోని ముస్లిం పవిత్ర పట్టణమైన మక్కాలో దారుణం చోటుచేసుకుంది. 31 మంది భక్తులు చనిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే... హజ్ యాత్ర కోసం 6 లక్షల 20 వేల మంది విదేశీయులు మక్కా చేరుకున్నారని, వీరిలో 31 మంది విదేశీయులు మృతి చెందారని సౌదీ అరేబియా ప్రకటించింది. 2015లో జరిగిన తొక్కిసలాట తరువాత చోటుచేసుకున్న అతిపెద్ద ప్రమాదం ఇదేనని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎలా మరణించారు? అన్న వివరాలను మాత్రం ప్రకటించలేదు. మృతుల వివరాలను ఆయా దేశాలకు తెలియజేస్తామని సౌదీ అరేబియా ప్రభుత్వం తెలిపింది. 

  • Loading...

More Telugu News