: కాంగ్రెస్ కు మరో పరాజయం.. మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితం!
ఆగస్టు 11న మధ్యప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 43 స్థానాలకు గాను కాంగ్రెస్ 15 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ 25 చైర్‌పర్సన్ స్థానాలు గెలుచుకుంది. స్వతంత్రులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఒక్క చింద్వారాలో మాత్రం కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అక్కడి ఆరు స్థానాల్లో నాలుగింటిలో విజయ దుందుభి మోగించింది. అక్కడ అధికార బీజేపీ ఒకటి, స్వతంత్రులు ఒక్క స్థానాల్లో విజయం సాధించారు. 2012లో జరిగిన ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే బీజేపీ మూడు సీట్లు తక్కువ గెలుచుకోగా, కాంగ్రెస్ ఆరు సీట్లు ఎక్కువ సాధించడం గమనార్హం. గెలిచిన ముగ్గురు స్వతంత్రుల్లో ఇద్దరు తమవారేనని కాంగ్రెస్ ప్రకటించింది.