: ఒవైసీ విజ్ఞప్తిపై కవిత స్పందన.. నిజామాబాద్ లో ఏబీవీపీ కార్యకర్తల అరెస్టు!


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచన మేరకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేయించిన ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిజామాబాద్ లోని ఒక కళాశాలలో ముస్లిం మతానికి చెందిన ప్రిన్సిపల్ జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే ఆయన షూ వేసుకుని జెండాను ఎగురవేశారని ఆరోపిస్తూ కొందరు ఏబీవీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు.

 దీనిపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ఎంపీ కవితను ఒవైసీ కోరారు. దీంతో శాంతిభద్రతల సమస్యలు రేపితే చూస్తూ ఊరుకునేది లేదంటూ దానిపై ఆమె పోలీసులను ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని నిలదీశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని అరెస్టు చేశారు. 

  • Loading...

More Telugu News