: చైనా ఆర్మీ అధికారులతో సమావేశమైన భారత ఆర్మీ అధికారులు!
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) రెండు సార్లు భారత్ లోని లడఖ్ లో చొరబడేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో భారత్-చైనా సైన్యానికి చెందిన అధికారులు లేహ్ సమీపంలోని చుషుల్ ప్రాంతంలో సమావేశం నిర్వహించారు. ఇందులో సరిహద్దులో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపుకుంటున్న వేళ చైనా సైన్యం భారత్ లో చొరబడే ప్రయత్నం చేయడమే కాకుండా, భారత సైన్యంపైకి రాళ్లు రువ్వింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు చెందిన ఆర్మీ అధికారులు సమావేశం నిర్వహించడం విశేషం. కాగా, దీనిపై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నిరాకరించారు.