: పాకిస్థాన్ కంటే ప్రతిపక్షాలే ప్రమాదకరం.. ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు!
కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, చైనాల కంటే ప్రతిపక్షాలే ప్రమాదకరమన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి బాగుందని ప్రశంసించారు. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. నిర్ణీత గడువు లోగానే ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విపక్షాలు ఒడిశాకు వెళ్లి ఈ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ట్రైబ్యునల్ అనుమతుల మేరకే ఎత్తు ఉండగా, ఎత్తు పెంచుతున్నారని విపక్షాలు ఒడిశాలో రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.