: చంద్రబాబు చేసిన డిగ్రీలు అవే!: వైఎస్ జగన్


మోసం చేయడంలో, కుల,మతాలను వాడుకోవడంలో చంద్రబాబు డిగ్రీలు చేశారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు జంక్షన్ లో రోడ్ షోలో జగన్ మాట్లాడుతూ, ‘అబద్ధాలు ఆడి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని నెరవేర్చలేదు. చంద్రబాబు సీఎం అయి 38 నెలలు అవుతుంది. వాడుకోవడం, తోసేయడం చంద్రబాబు నైజం.. ఈ రోజు పేపర్ చదివా. ఆ పేపర్ లో చంద్రబాబు ఏమన్నారో తెలుసా! రైతురుణాలను, పొదుపు సంఘాల రుణాలను పూర్తిగా మాఫీ చేశానని అన్నారు. సిగ్గులేకుండా, బొంకుతా ఉంటే, ఇలాంటి వ్యక్తికా మనం ఓటు వేయాల్సింది? అని అందరినీ అడుగుతున్నాను’ అంటూ జగన్ తీవ్ర స్వరంతో విమర్శించారు. 

  • Loading...

More Telugu News