: చంద్రబాబు రాయలసీమ ద్రోహి: రోజా తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న రోజా మాట్లాడుతూ, చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని, కరవుకు ప్యాంట్, షర్ట్ వేస్తే చంద్రబాబు అని, మూడేళ్ల పాలనలో ఒక్క హామీని ఆయన అమలు చేయలేదని మడిపడ్డారు. బాలామృతం పథకాన్ని కూడా అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించిన రోజా, నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.