: నాకున్న ఆస్తి ఇదే!: నంద్యాల ప్రచారంలో జగన్


నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అధినేత జగన్ ప్రచారం 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఆయన చింత అరుగులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధర్మానికి వ్యతిరేకంగా, ధర్మానికి మద్దతుగా ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఉప ఎన్నికలు వచ్చినందుకే ఇక్కడకు అందరూ వస్తున్నారని... ఇంతకు ముందెప్పుడైనా చంద్రబాబును కాని, ఆయన కుమారుడు లోకేష్ ని కాని, మంత్రులను కాని నంద్యాలలో చూశారా? అని ప్రశ్నించారు.

 చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. చంద్రబాబులా తాను అబద్ధాలను చెప్పలేనని... విశ్వసనీయతే తనకున్న ఆస్తి అని చెప్పారు. వైసీపీని గెలిపించడం ద్వారా ధర్మాన్ని రక్షించాలని కోరారు. చంద్రబాబులా తన వద్ద డబ్బులు లేవని... లేనిది ఉన్నట్టు చూపించే పేపర్లు, చానళ్లు తనకు లేవని అన్నారు.

  • Loading...

More Telugu News