: దుకాణదారుడిపై చేయిచేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే!
పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వపన్ బెల్కారియా నడిరోడ్డుపై ఓ దుకాణదారుడిని కొట్టారు. కొసిపూర్‌లోని రద్దీగా ఉండే ఓ బజార్‌లో రోడ్డు పక్కన పలువురు దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతం గుండా వెళ్లే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో స్థానికులు దానిపై ఆ ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకొని వాటిని తొలగించాలని ఆ ఎమ్మెల్యే చెప్పగా, ఓ దుకాణదారుడు అందుకు ససేమిరా అన్నాడు. దీంతో అతడితో గొడవపడిన ఎమ్మెల్యే ఆయనపై చేయిచేసుకున్నారు. అయితే, ఈ వార్త హల్‌చల్ చేస్తుండడంతో ఎమ్మెల్యే స్వపన్ వివరణ ఇచ్చారు. రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద గొడవ జరుగుతోందని తెలుసుకొని పరిష్కరించేందుకు అక్కడికి వెళ్లానని, ఎవరినీ కొట్టలేదని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది.