: దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ.. మా జాతికి రాలేదు: ముద్రగడ


భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, తమ కాపు జాతికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదని కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు. ఛలో అమరావతి పాదయాత్ర కోసం ఈరోజు కూడా ఆయన కిర్లంపూడిలోని తన నివాసం నుంచి బయల్దేరారు. ప్రతి రోజు మాదిరే ఈరోజు కూడా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పోలీసులైనా, ప్రభుత్వాలైనా చట్టాలకు లోబడే పని చేయాలని... కానీ, ఏపీలో మాత్రం అది జరగడం లేదని అన్నారు. కాపు జాతికే సెక్షన్ 30, 144లు అమలు చేస్తున్నారని... ముఖ్యమంత్రి సభకు అవి వర్తించవా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News