: ఆ అవకాశం త్రివిధ దళాల సిబ్బందికి మాత్రమే ఇచ్చామంటున్న ఎయిర్ ఇండియా!


సైన్యం, వాయుసేన, నావికా దళాల సిబ్బందికి ఎయిర్ ఇండియా తీపి కబురు చెప్పింది. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కన్నా ముందుగా విమానం ఎక్కే అవకాశం ఈ సాయుధ దళాల సిబ్బందికే ఇస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. త్రివిధ దళాల్లో ప్రస్తుతం పని చేస్తున్న వారినే కాకుండా, గతంలో పని చేసిన వారిని, భవిష్యత్తులో పని చేయబోయేవారిని గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వని లోహాని తెలిపారు.

ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కన్నా ముందుగానే వచ్చి విమానం ఎక్కాలని ఈ సందర్భంగా త్రివిధ దళాల సిబ్బందిని కోరుతున్నామని అన్నారు. దేశీయ ప్రయాణాల్లో సాయుధ దళాలకు విమాన ఛార్జీల్లో డిస్కౌంట్లు ఇస్తున్నామని, 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News