: బాలకృష్ణ ప్రచారంలో అపశ్రుతి.. బాలుడికి గాయాలు!
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్ షో ద్వారా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, ఆయన రోడ్ షో ప్రారంభించిన కాసేపటికే చిన్న అపశ్రుతి దొర్లింది. బాలయ్య కాన్వాయ్ లోని ఓ వాహనం ఓ బాలుడిని ఢీకొంది. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు స్వల్పంగా గాయపడ్డాడని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
మరోవైపు బాలయ్య మాట్లాడుతూ, నాన్న స్థాపించిన తెలుగుదేశం పార్టీని అభిమానులంతా ఆదరించారని... ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపరచాలని అన్నారు. తానెప్పుడు షూటింగ్స్ కోసం వచ్చినా... తన కోసం భూమా కుటుంబం తమ ఇల్లు ఇచ్చేవారని చెప్పారు. భూమా కుమార్తె అఖిలప్రియ మంత్రి కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా 'ఒక్క మగాడు' సినిమాలో కులాలపై ఉన్న డైలాగును బాలయ్య చెప్పగా, అభిమానులు ఈలలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.