: నా కొడుకు మాటలతో నాకు సంబంధం లేదు... వాడేం చిన్న పిల్లాడు కాదు: డీఎస్


తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ డీ శ్రీనివాస్ కుమారుడు అరవింద్, ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రకటన, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన వేళ, డీఎస్ స్పందించారు. తన కుమారుడు ఇచ్చిన ప్రకటనతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని ఆయన స్పష్టం చేశారు. అరవింద్ ఇచ్చిన ప్రకటనకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. అతనేమీ చిన్న కుర్రాడు కాదని, ఆ ప్రకటన వెనుక అర్థమేంటో అరవింద్ నే అడగాలని తెలిపారు. అరవింద్ కూడా బీజేపీలో చేరతాడని తాను భావించడం లేదని, తాను టీఆర్ఎస్ ను వీడే అవకాశమే లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తాను నడుస్తానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News