prabhas: 'సాహో'లో ఛాన్స్ ఆమెకి దక్కి ఉండాల్సిందట!


బాలీవుడ్ తెరపై భారీ అందాలను ఆరబోస్తూ అక్కడ కుదురుకోవడానికి ప్రయత్నించే కథానాయికలలో 'నిధి అగర్వాల్' ఒకరు. అందం .. అంతకి మించిన ఆకర్షణ ఈ సొగసరి సొంతం. నిధి అగర్వాల్  మంచి పొడగరి కూడా కావడంతో, ఆమెను 'సాహో' సినిమాలో కథానాయికగా తీసుకోవాలనుకున్నారు.

 అయితే టైగర్ ష్రాఫ్ తో ఆమె చేసిన 'మున్నా మైఖేల్' హిట్ అయితే ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు. కానీ రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది. దాంతో నిధి అగర్వాల్ ను తీసుకోవాలనే ఆలోచనను 'సాహో' దర్శక నిర్మాతలు విరమించుకున్నారు. ఫలితంగా ఛాన్స్ కాస్తా  శ్రద్ధా కపూర్ కి వెళ్లింది. అలా ప్రభాస్ జోడీకట్టే ఛాన్స్ ను నిధి అగర్వాల్ మిస్ అయింది .. పాపం.   

prabhas
shraddha kapoor
  • Loading...

More Telugu News