: వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతున్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రేస్-2' చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'రేస్-3'లో సల్మాన్ నటించబోతున్నాడు. ఈ సినిమాను త్రీడీ ఫార్మాట్ లో తెరకెక్కించనున్నట్టు సమాచారం. రెమో డిసౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవల విడుదలైన 'ట్యూబ్ లైట్' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా... తన తాజా చిత్రం 'టైగర్ జిందా హై'తో మళ్లీ ట్రాక్ లోకి రావడానికి సల్లూభాయ్ యత్నిస్తున్నాడు. మరోవైపు 'భరత్', 'గో డ్యాడీ' సినిమాలతో సల్మాన్ బిజీగా ఉన్నాడు.