: శ్రీశ్రీ రవిశంకర్ శాంతిమంత్రం పనిచేసింది... లొంగిపోయిన 68 మంది తీవ్రవాదులు
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ (ఏవోఎల్) వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గత కొన్నేళ్లుగా వల్లిస్తున్న శాంతి మంత్రం పనిచేసింది. ఆయన చొరవతో మణిపూర్‌లో 68 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు. వారి దగ్గర ఉన్న ఆయుధాలు, తుపాకులను పోలీసులకు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిస్థాపన కోసం చేస్తున్న ఆయన కొన్నేళ్లుగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.
11 తీవ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు లొంగిపోయేలా చేసినందుకు శ్రీశ్రీ రవిశంకర్ కి మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌షా కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే మణిపూర్ లోని ఇతర తీవ్రవాద సంస్థలతో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్రవాదులకు శాంతి మంత్రాన్ని చేర్చడానికి ఏవోఎల్ ప్రతినిధులు సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితులను సైతం లెక్కచేయకుండా వారి వద్దకు వెళ్లి ఉపదేశించారు.