: కరుణానిధికి అస్వస్థత... హుటాహుటిన కావేరీ ఆసుపత్రికి తరలింపు, కార్యకర్తల్లో టెన్షన్!


డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఈ తెల్లవారుజామున అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. ఆ వెంటనే ఆయన కుటుంబీకులు చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంకే కార్యకర్తలు, కరుణానిధి అభిమానులు భారీ సంఖ్యలో కావేరీ ఆసుపత్రి వద్దకు చేరారు. తమ అధినేత ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కరుణానిధి పరిస్థితి ఎలా ఉందన్న విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది. కాగా, గత సంవత్సరం డిసెంబర్ లోనూ గొంత, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ, కరుణానిధి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News