: ఆ చేపలకు నిలువెల్లా విషం... విశాఖ సముద్ర తీరాన సంచారం!


విశాఖ సముద్రతీరంలో విషపూరిత చేపల సంచారం కలకలం రేపుతోంది. ఎంతో ఆహ్లాదంగా కనిపించే సముద్ర తీరంలో ఇంతవరకు ఇలాంటి విషపూరిత చేప జాతుల సంచారం లేదని, అయితే తొలిసారి షార్ప్ టైల్ మొల పేరుతో పిలుచుకునే విషపూరిత చేపను గుర్తించామని ఏయూ మెరైన్ పరిశోధక బృందం తెలిపింది. ఈ చేపలకు ఒళ్లంతా విషం ఉంటుందని వారు తెలిపారు. తెలియని వారు దీనిని తింటే తొలుత వాంతులు అవుతాయని, దాని నుంచి తేరుకునే లోపు పక్షవాతానికి గువుతారని, దానిని నుంచి తేరుకునేసరికి ప్రాణాలు పోతాయని వారు చెబుతున్నారు. దీంతో విషపూరిత చేపల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

కాగా, మత్స్యకారులు మాత్రం తాము కేవలం ఆహారంగా వినియోగించే చేపలను మాత్రమే పడతామని, కప్ప జాతి చేపలను ఒడ్డుకు కూడా తేమని వారు చెబుతున్నారు. కప్ప జాతికి చెందిన చేపలు పట్టవద్దని తమ అపెద్దలు చెబుతారని అన్నారు. తమ పెద్దల నుంచి ఏ చేపలు పట్టాలి? ఏ చేపలు పట్టకూడదు? అన్న సూచనలు తీసుకున్నామని, వాటి ప్రకారమే తాము చేపలు పడతామని చెప్పారు. కప్పజాతి చేపలంటే తల నుంచి నడుం వరకు కప్ప లేదా తాబేలులా వెడల్పుగా ఉంటుందని, ఆ తరువాత చేపలా ఉంటుందని వారు చెప్పారు. అలాంటి చేపలను తాము పట్టించుకోమని వారు చెప్పారు. అవి తమ దగ్గరకు వచ్చినా వాటిని ముట్టుకోమని అన్నారు. 

  • Loading...

More Telugu News